ఏపీ

వైఎస్సార్‌సీపీ పతనానికి ఆ కుట్రలే కారణం: చీఫ్‌విప్ అనురాధ

ఐదు దశాబ్దాల సుదీర్ఘ మచ్చలేని రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు నాయుడిని నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన సెప్టెంబర్ 9వ తేదీ తెలుగు ప్రజల చరిత్రలోనే ఒక చీకటి రోజని ఏపీ శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనాడు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారని అన్నారు.