తెలంగాణ
మనదేం అమెరికా కాదు.. ఏసీ బస్టాండ్లు కట్టలేం: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణలో ఆర్టీసి బస్టాండ్లు, రవాణా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారిక అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. ప్రజా రవాణా వ్యవస్థ, ప్రయాణికుల వసతులపై మాట్లాడుతూ.. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అమెరికా లాంటి అగ్రరాజ్యంలా ఉండదని, ప్రయాణికులందరికీ ఏసీ బస్టాండ్లు నిర్మించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
