సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్
రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తన కూతురు కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సురేఖను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం పంపిన లేఖ లోక్‌భవన్‌కు చేరింది. కొండా సురేఖ పదవి పోవడానికి గల అసలు కారణాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు నుంచే ఈ కథ మొదలైందని పేర్కొన్నారు. డబ్బుల వాటా విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వివాదం ముదిరిందని.. సురేఖను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన రాజాసింగ్.. డబ్బుల వివాదమే కొండా సురేఖ మంత్రి పదవి పోవడానికి కారణమని ఆరోపించారు.
