తెలంగాణ

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక అసలు కథ ఇదే.. నాగార్జున మనసు ఎలా మారిందంటే?

  రెండేళ్ల కిందట ఆగస్టులో హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' (N Convention) సెంటర్‌ను హైడ్రా (HYDRAA) అధికారులు కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ కూల్చివేత వెనుక అనేక రాజకీయ కథనాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాగార్జునను బాధితుడిగా చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, మరోవైపు కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వ హయాంలోని లోపాల వల్లే ఈ అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రత్యారోపణలు చేశారు.