ఏపీ
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం!
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతున్న తిరుమలకు.. వీకెండ్ వస్తే చాలు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో రోజు సుమారుగా 60వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక తిరుమలలో రద్దీ పెరగడంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. మంగళవారం ఆదాయం రూ.6 కోట్ల మార్క్ దాటేసింది. నిన్న ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చింది.
