వైరల్ న్యూస్
Thief Asleep: వార్నీ..! చోరీకి వెళ్లిన ఇంట్లోనే గురకపెట్టి నిద్రపోయిన దొంగ.. వీడియో వైరల్
కొందరు దొంగలు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. చోరీలకు వెళ్లిన సమయంలో వారు చేసే విన్యాసాలు విస్తుపోయేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో నవ్వులు పూయిస్తాయి. చోరీకి వెళ్లిన ఇంట్లోనే తినడం, తాగడం చేస్తుంటారు. మరికొందరు ఎంచక్కా బెడ్ రూమ్ లోకి వెళ్లి పడక మీద హాయిగా నిద్రపోవడమూ చూశాం. తాజాగా అలాంటి విచిత్రమైన ఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి దూరిన దొంగ.. ఆ ఇంట్లోనే గురక పెట్టి మరీ నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
