వైరల్ న్యూస్
ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. ఐ ఫోన్స్‌ను వదిలేస్తారా?
హోర్ముజ్ జలసంధిలో మునిగిపోయిన ఓ నౌక కంటెనర్లో రూ.కోట్ల విలువైన ఐఫోన్స్ నీళ్లలో పడిపోగా అవన్నీ తేలుతూ తీరానికి కొట్టుకొస్తున్నట్టు తెలిసింది.మూడు రోజుల కింద కార్గో షిప్ సీ మైన్‌ను ఢీకొట్టగా మంటలు చెలరేగి ప్రమాదవశాత్తు ఆ నౌక నీట మునిగింది. అందులోని కంటెనర్లలో ఒకటి బ్రేక్ అవ్వగా..దాని నుంచి ఐఫోన్స్ బయటపడ్డాయి. అవన్నీ నీటిలో తేలియాడుతూ కనిపించాయి. అవి నెమ్మదిగా తీరానికి కొట్టుకొస్తుండటంతో వాటిని తీసుకోడానికి తీరం ప్రజలు ఎగబడినట్టు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లే పడవల ద్వారా సముద్రంలోకి వెళ్లి ఐఫోన్స్ తీసుసుకోవడంతో పాటు పర్ఫ్యూమ్స్ తీసుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి.
