క్రీడలు
‘అసలు నిజాన్ని దాచారు..’ శాండ్పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు!
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన 2018 కేప్ టౌన్ బాల్ ట్యాంపరింగ్ (శాండ్పేపర్గేట్) వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ భగ్గుమంది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల విడుదల చేసిన తన ఆత్మకథ 'సబర్' (Sabr)లో అప్పటి కుట్ర గురించి సంచలన విషయాలను బయటపెట్టడంతో ఆసీస్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం చెలరేగింది. ఈ వివాదంపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
