నాపై నిఘా పెట్టారు.. అరెస్టు చేస్తే చేసుకోండి : దీప్కే
దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతివాహనదారుడిని, పౌరుడిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పండుగల వేళ సీజేపీ నిరసన కారుల ముసుగులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు,భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. జంతర్ మంతర్ పరిసరాల్లోకి నిరసనకారులు ఎవరినీ అనుమతించడం లేదు. ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించిన మాదిరి దర్శనమిస్తోంది. ఇదిలాఉండగా, జంతర్ మంతర్ బ్యాన్ చేయడంతో మరో చోట తిరంగా ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తాజాగా స్పందించారు.'లెహ్రా దో తిరంగా' మార్చ్‌కు ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయని, ఆంక్షలు విధించారన్నారు. సెంట్రల్ పార్క్ మూసివేశారని చెప్పారు. అయినప్పటికీ తాను భయపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడే ఉన్నానని, కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
