2 లక్షల ఉద్యోగాల పేరిట మోసం చేశారు : హరీష్ రావు
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత అమలు చేస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరాన్ని హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేదని అన్నారు. రాష్ట్రంలో వాస్తవానికి 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ నేతల పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ‘ఖాళీలు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేక నిరుద్యోగాలను మోసం’ చేస్తుందని విమర్శలు చేశారు.
