తెలంగాణ

మీడియాతో అబద్ధాలు రాయిస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

 ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టిందంటూ రేవంత్‌రెడ్డి తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయించారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ.. ‘కేవలం వేయి కోట్లు ఇచ్చి ఆ లక్ష కోట్ల ఆస్తులన్నింటినీ రేవంత్ రెడ్డి తీసుకోమని, మిగిలిన 99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని’ ఎద్దేవా చేశారు.