తెలంగాణ

అవన్నీ డీప్‌ఫేక్.. ఏఐ చిత్రాలతో మాపై దుష్ప్రచారం: కేటీఆర్

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ రోజున జరిగిన ఉద్రిక్తతలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. సమయంలో అటు పోలీసులు,ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, అసెంబ్లీ ప్రారంభం రోజున జరిగిన తోపులాటకు సంబంధించి కొన్ని డీప్ ఫేక్ చిత్రాలు బయటకు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియా తమ ప్రతిష్టను దిగజార్చేందుకు ‘ఏఐ’ ద్వారా నకిలీ చిత్రాలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ చిత్రాలను ఆయుధంగా మలుచుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.