International
మానవ నియంత్రణ లేని ఏఐతో ప్రయోజనం లేదు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (AI) అభివృద్ధి వేగం, దాని భద్రతపై అంతర్జాతీయ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న తీవ్రమైన చర్చలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భాగమయ్యారు. సూపర్‌ఇంటెలిజెన్స్ రూపకల్పనలో మానవ నియంత్రణ, మానవాళి శ్రేయస్సే అత్యంత ప్రాథమిక సూత్రాలుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ దిగ్గజాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు ఆయన తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
