నిరీక్షణ ముగిసింది.. బాంబ్పేల్చిన కొండా సురేఖ
మంత్రి పదవి నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ వరుసగా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక ఆమె కొంతకాలం పాటు మౌనంగా ఉండిపోతారని అంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా కొండా సురేఖ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి పోయినందుకు బాధగా ఉన్నా దానిని ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా (ఫేస్బుక్)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ఇక నిరీక్షణ ముగిసింది’ రాసుకొచ్చారు.త్వరలోనే బిగ్ అప్డేట్ ఉంటుందని, తెలంగాణ వేచి చూడాలని పేర్కొన్నారు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించడంతో కొండా సురేఖ తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది..
