తెలంగాణ
స్వేచ్ఛ ఎఫెక్ట్.. తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి
నిషేధిత భూముల జాబితా అంశంలో పొరపాటు జరిగినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల జాబితా వివాదంపై గత కొన్ని రోజులుగా స్వేచ్ఛ న్యూస్ అనేక కథనాలు రాసింది. ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. భూ బాధితులకు అండగా నిలబడింది. వారి వాయిస్‌ను బలంగా వినిపించింది. నిషేధిత భూముల జాబితా అప్ డేట్లో పొరపాట్లు జరిగాయని వరుసగా కథనాలు ఇచ్చింది. స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల 22ఏ పై బీబీసీకి కూడా వివరాలు ఇచ్చారు.
