ఏపీ
కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు గత మూడు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం నేలలకు సంజీవని లాంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నల్లమల గిరులను చీల్చుకుంటూ నిర్మించిన సొరంగాల ద్వారా ఉరకలెత్తుతూ వస్తున్న కృష్ణా జలాలను చూసి ఆ ప్రాంత రైతాంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది. దశాబ్దాల తరబడి తాము ఎదురుచూసిన సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరబోతున్నాయన్న ఆనందం రైతుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.
