National

ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు : చీఫ్ మోహన్ భగవత్

ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్ నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమానికి హాజరైన పలువురు ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్బంగా ఆయన ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. తమను హిందూ దేశం నుంచి వెళ్లగొడతారా? అని గతంలో ముస్లిం ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన తాజాగా న్యూయార్క్ వేదిక‌గా స‌మాధానం ఇచ్చారు. తమను తాము హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ అన్ని మార్గాలు(అన్ని మతాలు) ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయని నమ్మాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.