National

‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ గర్జన.. మరో ఉద్యమానికి సిద్ధమా?

దేశంలో మరో రివల్యూషన్ రాబోతున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తయింది. వెనకబడిన వర్గాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, ఈ రిజర్వేషన్ల కారణంగా తాము నష్టపోతున్నామని కొందరు విద్యార్థులు, అగ్రవర్ణాల వారు ఆందోళన చెందుతున్నారు.అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, మధ్యతరగతి వారు ఉన్నారని, కులాల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం వలన తాము పేదరికంలో ఉన్నా తమకు రిజర్వేషన్లు వర్తించడం లేదని, తీరా కష్టపడి చదివి జాతీయ స్థాయిల్లో ర్యాంకులు సాధిస్తే రిజర్వేషన్ల కారణంగా అనుకున్న కాలేజీ,వర్సిటీల్లో సీట్లు రావడం లేదని వాపోతున్నారు. అందుకే కులం ఆధారిత రిజర్వేషన్లు తొలగించి కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి..ఈ క్రమంలోనే ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’పేరిట నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. ఇది దేశం దృష్టిని ఆకర్షించింది.