టాప్ న్యూస్

రేవంత్ సర్కార్ బాదుడే బాదుడు.. ప్రజల నెత్తిన మరో పిడుగు!

రేవంత్ సర్కార్ సామాన్యుడి మీద మరో భారం మోపేందుకు సిద్ధపడింది. తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో విద్యుత్ వినియోగదారులపై ‘ట్రూ అప్’ ఛార్జీల భారం పడనుంది. నవంబర్ 1 నుంచి ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్సీ అనుమతి ఇవ్వడంతో వసూలుకు డిస్కంలు రెడీ అవుతున్నాయి. నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు వసూలు చేయనున్నట్టు తెలిసింది. SPDCLకు 29 నెలలు, NPDCLకు 26 నెలలు వసూలుకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.కాగా, వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇవ్వగా.. రైతుల వాటా రూ.2,215 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుంది.