National
తిరుమల వేంకటేశుడి చిత్రానికి రూపమిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు కన్నుమూత!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఇళ్లలో, పూజా మందిరాల్లో నిత్యం పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య చిత్రపటానికి తన కుంచెతో జీవం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తన స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. శ్రీనివాసన్ మరణవార్త తెలుసుకున్న కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
