సినిమా
‘రామాయణ కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు..’ రాంగోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) చిత్రంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కేవలం ఒక సాధారణ భక్తిరస సినిమా మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిలోని అపారమైన మానసిక సమర్థతను చాటిచెప్పే ఒక ‘భక్తి శక్తి’ అని అభివర్ణించారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్న ఈ చిత్రంపై వచ్చే కొద్దిపాటి విమర్శలను చిత్ర బృందం ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
