చిత్రం లేదు
స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

ఫేక్ ORCల దందా.. దర్యాప్తునకు రేవంత్ సిద్ధమా?

 రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న భూ ఆక్రమణలు, నకిలీ ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికేట్ (ORC) ల వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల 'నమస్తే తెలంగాణ', ఈరోజు 'సాక్షి' దినపత్రికల్లో వెలువడిన ఇన్వెస్టిగేషన్ స్టోరీలకు సంబంధించిన అసలు నిజాలను 2023 జనవరిలోనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు చింతకుంట్ల దేవేందర్ రెడ్డి(స్వేచ్ఛ చైర్మన్)  సంచలన విషయాలను బయటపెట్టారు.  ప్రధాన మీడియా ఈ ఘోర అక్రమాలను గుర్తించి వార్తలు రాయడానికి దాదాపు మూడేళ్ల 8 నెలల సుదీర్ఘ సమయం పట్టింది. గతంలో ఓ బీఆర్ఎస్ నేత పేరు మీద ఉన్న భూమి, తదనంతరం ఇనాం చేసిన భూమిగా మారడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివాదాస్పద భూమిలోకి దానం, ఠాకూర్, షకీల్ వంటి వ్యక్తులు ఎలా ప్రవేశించారనే దానిపై స్పష్టమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది.