వైరల్ న్యూస్

సోషల్ మీడియా పవర్.. మూడేళ్ల చిన్నారి ఆవేదనకు జగిత్యాల కలెక్టర్ స్పందన!

తల్లిదండ్రులకు దూరమై శిశు సంక్షేమ గృహంలో ఆవేదన అనుభవించిన ఓ మూడేళ్ల చిన్నారి(బాబు) కన్నీటి గాథ తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది. మూడేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను దత్తత వివాదం పేరిట అధికారులు వేరు చేయడంతో, దాదాపు రెండు నెలలుగా ఆ తల్లిదండ్రులు తీవ్ర నిరీక్షణ అనుభవించారు. ఈ క్రమంలో బిడ్డను పరామర్శించేందుకు వచ్చిన తల్లిదండ్రులను చూసి, ‘అమ్మా.. భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లు’ అంటూ ఆ చిన్నారి ఏడ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) విపరీతంగా వైరల్ అయ్యాయి.