సినిమా
The Paradise-Kayadu: కయాదు లోహర్ని ఎందుకు దాచేసున్నారు..ఇది మైనస్ అవుతుందేమో?
The Paradise: నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో 7 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఎలాంటి, భారీ స్థాయి ప్రమోషన్స్ లేకపోయినా సినిమాపై మాత్రం అందరిలో మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. అంతేకాదు, ఇప్పటికే యూఎస్ లో రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ సేల్ అయ్యాయి. అయితే, అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకూ కయాదు లోహర్ హీరోయిన్ అని ఎస్టాబ్లిష్ చేయకపోవడమే.
