సినిమా
The Paradise-Irumudi: రవితేజను ఫాలో అవుతున్న నాని..ప్యారడైజ్ కి నో టికెట్ హైక్!
The Paradise: బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమా రిలీజవుతుంటే ఎక్కువగా సందడి చేసేది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడియన్సే. అప్పర్ మిడిల్ క్లాస్ వచ్చే పర్సెంటేజీ కాస్త తక్కువ అంతే. వీరిలోనే అన్నీ రకాల ఆడియన్స్(ఫ్యామిలీ, యూత్, ఏజ్డ్) ఉంటారు. రిపీటెడ్ ఆడియన్ ఉండాలంటే సినిమా బావుండాలి..టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ స్ట్రాటజీ ఫాలో అయింది కాబట్టే ఇరుముడి భారీ లాభాలను దక్కించుకుంది. ప్యారడైజ్ విషయంలోనూ అదే ప్లాన్ చేస్తున్నారట.
