సినిమా

The Paradise-Censor: సెన్సార్ పూర్తి (A)..‘ది ప్యారడైజ్’ పెద్దలకు మాత్రమే..

The Paradise: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కింది ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం (సెప్టెంబర్ 24) పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం, జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇక, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎ సర్టిఫికెట్‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.