Congress : ఎంపీ చామల ఎపిసోడ్.. ఆగ్రహంతో ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్!
కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే మీడియా ప్యానలిస్టులు, మీడియా కో ఆర్డినేటర్లు, సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధుల జాబితాను మీడియా & పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, చామల ఇచ్చిన ఈ నియామకాల జాబితాను వెంటనే నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.అయితే, చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన జాబితా సరైనదేనని, తాము పదవుల్లో కొనసాగుతామని, వెనక్కి తగ్గేది లేదని జాబితాలోని సభ్యులు హంగామా సృష్టించినట్టు సమాచరాం. అయితే, తనకు అధికారాలు ఉన్నాయని ఎంపీ చామల వాదించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది.
