National
వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న అక్టోబర్ నెల!
వినియోగదారులకు అక్టోబర్ నెల షాక్ ఇవ్వనుంది. మేజర్ హిందూ పండుగలు వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి. దసరా, దీపావళికి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెంపు షాక్ తగలనుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఏసీ ధరలు సుమారు 5–8 శాతం, కొన్ని టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్ల ధరలు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాగి, అల్యూమినియం, ఉక్కు, క్రూడ్ డెరివేటివ్స్ ధరలు, ఫ్రైట్ ఖర్చులు, కరెన్సీ మార్పులు ఈ పెంపునకు కారణాలుగా చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉండనుంది. టీవీ, ఏసీల తయారీకి ఉపయోగించే ముడిచమురు కొరత, దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులే ఇందుకు కారణమని సమాచారం.
