తెలంగాణ
సంపాదన మంత్రులది.. ఖర్చేమో మాదా?
తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ ఏర్పడిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ఇన్చార్జీలను సైతం నియమించారు.కానీ, వారి నుంచి ఆశించిన స్థాయిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సహకారం అందడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే మంత్రుల తీరుపై స్థానిక ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు.
