సినిమా

ఎఫ్‌డీఏ సీరియస్.. ముగ్గురు స్టార్ హీరోలకు బిగ్ షాక్!..

హీరోలు అంటే కేవలం సినిమాల్లో కనిపించే తారలు కాదు.. సమాజాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీలు. అలాంటి హీరోలు డబ్బు కోసం ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను పరోక్షంగా ప్రమోట్ చేస్తే.. బాధ్యత ఎవరిది? నిషేధిత పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే రూ.10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.