స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
MiyapurLandScam: మియాపూర్ భూములను వదలని మాఫియా!
హైదరాబాద్ నగర శివార్లలోని మియాపూర్ భూముల వ్యవహారం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాల 39 గుంటల భూమిపై తెలంగాణ ప్రభుత్వానికే యాజమాన్య హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బండారి రామచందర్ తదితరులు వర్సెస్ మైత్రి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తదితరుల మధ్య సాగిన సివిల్ అప్పీళ్లను అక్టోబర్ 29, 2026న కొట్టివేస్తూ, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ భూమి విలువ సుమారు రూ.55,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
