తెలంగాణ

‘ఇందిరమ్మ’ డిపాజిట్ ఇంకెప్పుడిస్తరు సీఎం సారూ?

హైదరాబాద్‌ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్లలో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకుని, డ్రాలో ఎంపిక కాని వారికి ప్రభుత్వం డిపాజిట్ సొమ్ము (EMD) రూ. 10,000 తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది.అయితే, చాలా మందికి డిపాజిట్ సొమ్ము రాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో తమకు రీఫండ్ ఎప్పుడు వస్తుందా? అని దరఖాస్తుదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ లక్కీ డ్రాలో పాల్గొనేవారు రూ.10వేలు డిపాజిట్ కట్టాలని, లక్కీడ్రాలో ఇళ్లు వచ్చిన వారికి ఆ సొమ్ము తిరిగి ఇవ్వబడదని, పేరు రాని వారికి వెంటనే ప్రభుత్వం రీఫండ్ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లక్కీ డ్రా నిర్వహించి నెల రోజులు పూర్తయినా ఇంకా దరఖాస్తు దారులకు టోకెన్ అమౌంట్ రాలేదు.