National

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా?

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా? మనం సాధించిన సాంకేతిక పురోగతే ఇప్పుడు మన పాలిట శాపంగా మారుతోందంటూ అంతర్జాతీయ స్థాయి నిపుణులు హెచ్చరికల సైరన్ మోగించారు. 2100 నాటికి భూగోళంపై మనుషుల ఆనవాళ్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ వెలువరించిన తాజా పరిశోధన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.ఈ వినాశనానికి ప్రధాన కారణం సాంకేతికత అదుపు తప్పడమేనని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కలిగే నష్టం ఊహకందనిది. ఆధునిక ఏఐని దుర్వినియోగం చేస్తూ రహస్య ప్రయోగశాలల్లో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, కొత్త తరం వైరస్‌లను డిజైన్ చేసి బయోవెపన్స్‌గా మార్చే తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఒక చిన్న ల్యాబ్ నుంచి లీక్ అయ్యే ఒక్క బయోవెపన్ క్షణాల వ్యవధిలో దేశాలకు దేశాలనే శ్మశానాలుగా మార్చగలదు.