తెలంగాణ

రాజసమా? రాజకీయమా? హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం!..

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం రోజురోజుకూ హాట్‌టాపిక్‌గా మారుతోంది. పార్టీ నాయకత్వం తీరుపై ఆయన బహిరంగంగా ప్రశ్నలు సంధించడం.. పోచారం, దానం వంటి నేతల చేరికలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి నాయకత్వాన్నే సవాల్ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజగోపాలరెడ్డి.. ఇప్పుడు మరోసారి పార్టీ మారుతారా? బీజేపీ వైపు చూస్తారా? కొత్త రాజకీయ వేదిక పెడతారా? లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాడతారా? అన్నదే సస్పెన్స్. ఇదంతా జరుగుతున్నా హైకమాండ్ మౌనం ఎందుకు? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.