తెలంగాణ
కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి వ్యవహారం.. తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం!
తెలంగాణ శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే సభలో తీవ్రమైన రాజకీయం, గందరగోళ వాతావరణం నెలకొంది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నేతలు, వివిధ దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. అయితే, నిరసనకారులు వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు పాలతో, నీళ్లతో శుద్ధి చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సభ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
