తెలంగాణ
సర్కార్ కర్కశత్వం.. జూరాల రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు!
అన్నదాతల పట్ల రేవంత్ సర్కార్ కర్కశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగు కోసం నీళ్లు ఇవ్వలేదని అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే, పంటలకు నీళ్లు ఇవ్వని సర్కార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం, నీటి కోసం పోరాటాలు చేస్తున్నందుకు రివర్స్‌లో వారిమీదే కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగడం పాటు అధికారుల ప్రమేయం లేకుండా నీటిని దిగువకు వదిలిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రైతులకు సాగునీటి విడుదలకు నిరాకరించడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
