స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
‘వాట్సాప్’ కట్టిన కోట.. ‘ఇన్‌స్టాగ్రామ్’ తిరుగుబాటు!
భారత రాజకీయాల్లో కమలం పువ్వు వికసించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అయితే, నాటి సమాచార విప్లవానికి, నేటి పరిస్థితులకు మధ్య ఒక తరం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వచ్చిన ఊపు బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడితే.. నేటి కొత్త తరం వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ట్రెండ్స్ ఆ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి.
