తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ వైరం ముదురుతోంది. నిన్న అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద జరిగిన తీవ్ర ఉద్రిక్తతలపై, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు జరిపిన దాడిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అయితే, స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టుపై తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం. శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుని అవమానించింది పోలీసులు, ప్రభుత్వమే.మగ ప్రజా ప్రతినిధులకు అడ్డుగా మహిళా పోలీసులను, మహిళా ప్రజాప్రతినిధులకు అడ్డుగా మగ పోలీసులను మోహరించి అడ్డుకోవడం వెనక కుట్ర దాగి ఉంది’ అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
