National

ఈసీ అబద్ధాలు ఆడుతోంది.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి : ప్రకాశ్ రాజ్

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేశారు. తన ఓటు హక్కు తొలగించినందుకు ఆయన ఈసీ, కేంద్రంలోని మోడీ సర్కారును తప్పుబట్టిన విషయం తెలిసిందే. తన ఓటును తొలగించినంత మాత్రాన ఏమీ కాదని, త్వరలోనే మిమ్మల్ని గద్దెదింపుతామని ప్రధాని మోడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అయితే, ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించలేదని మరల ఈసీ క్లారిటీ ఇచ్చింది. దీనిపై మండిపడిన ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఈసీ అధికారులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. తన ఓటు తొలగించలేదని ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై అబద్ధం. నా ఓటు తొలగించారని వీడియో చేశాక.. నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని అధికారులు చెప్పారు. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి.