క్రైమ్
ఇద్దరిని కలిపిన డేటింగ్ యాప్.. ఎంగేజ్మెంట్ రద్దుచేసుకుందని..!
డేటింగ్ యాప్ పరిచయం కాస్త ఓ యువతిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.పెళ్లివరకు వెళ్లిన ఈ బంధం కాస్త యువకుడి ప్రవర్తనతో రద్దు అయ్యింది. దీంతో సదరు వ్యక్తి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. నిశ్చితార్థం రద్దు చేసుకుందనే కోపం ఇదంతా చేయడం ప్రారంభించాడు. మొహంపై యాసిడ్ పోస్టా.. లేదా చంపేస్తా.. అని బెదిరింపులు మొదలెట్టడంతో సదరు యువతి భయపడి ఇంట్లోనే ఉంటున్నట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. హైదరాబాద్–వనస్థలిపురంలో ఉంటున్న యువతి (33).. ఓ బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది.ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా తిరుపతికి చెందిన అంబావారి వంశీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించుకుని పెళ్లివరకు ప్రేమ బంధాన్ని తీసుకెళ్లారు.
