తెలంగాణ
కాంగ్రెస్ను స్థాపించింది బిట్రీష్ వాడు..‘డివైడ్ అండ్ రూల్’ దాని సిద్ధాంతం : రఘునందన్ రావు
దేవుళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. రాముడు ధనవంతుల దేవుడు అయితే భద్రచాలం రామయ్య వద్దకు తన సతీమణితో కోలిసి సీఎం ఎందుకు తలంబ్రాలు తీసుకువెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. తాము ద్రవిడులం, శివుడిని కొలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్లారా? కొమురవెల్లి మల్లన్నకు ఏమైనా చేశారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటీష్ వ్యక్తి అని.. బ్రిటీష్ వారు చెప్పినట్టు ‘డివైడ్ అండ్ రూల్’ ప్రకారమే ఆ పార్టీ నడుస్తుందని వివరించారు. చివరకు దేవుళ్లను విభజించాలనే రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తాము చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.
