తెలంగాణ

సీఎం నాతో ఇదే చెప్పారు.. అదే చేస్తా : దానం నాగేందర్

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంలో తనకు నెగెటివ్ తీర్పు వస్తుందని ఆయన కూడా ఊహించలేదని తెలిసింది. దీంతో కొంత నిరాశకు గురైన దానం నాగేందర్.. శనివారం మరోసారి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఆయన సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయగా.. అప్పీల్‌కు వెళ్తారా? అని మీడియా ప్రతినిధులు అడుగగా.. సుప్రీంకోర్టుకు వెళ్లేది లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా? అనేది స్పీకర్ నిర్ణయమని స్పష్టంచేశారు. ఎందుకంటే ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఆధారంగానే తీర్పు కాపీ వచ్చిందని , తాను ఆర్డర్ కాపీని పూర్తిగా చదివానని చెప్పారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పిన దానం.. ‘నువ్వు ఫైటర్.. ఫైట్ చేద్దామని’ సీఎం తనతో అన్నారని పేర్కొన్నారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఎన్నికల్లో కొట్లాడటానికి ఇష్టపడతానని, కార్యకర్తలకు కూడా ఇదే విషయం చెప్పానన్నారు.