National

‘రాజీనామాకు కారణమదే..’ తొలిసారి మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్!

నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత, సంబల్‌పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆ అంశంపై తొలిసారి నోరు విప్పారు. జూలై 25న రాజీనామా సమర్పించిన సరిగ్గా రెండు వారాల తర్వాత ఒడిశాలోని భువనేశ్వర్ జీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని నవతరం విద్యార్థులను (జెన్-జీ) కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించారని, ఈ క్రమంలో వారి ఆకాంక్షలను కాపాడటానికే తాను మంత్రి పదవిని వదులుకున్నానని వెల్లడించారు.