తెలంగాణ

TG: అగ్నిమాపక శాఖకు సజ్జనార్‌.. పోలీస్‌శాఖలో భారీగా బదిలీలు

TG: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం అనూహ్యంగా భారీ ప్రక్షాళన చేపట్టింది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ బదిలీల జాబితాలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌ను అక్కడి నుంచి తప్పించి, అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీసెస్) డీజీగా బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సజ్జనార్ స్థానంలో డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.1996 బ్యాచ్‌కు చెందిన వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తెలంగాణ ఫైర్ సర్వీసెస్, విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీనితో పాటు ఆయనకు ఎస్పీఎఫ్ (SPF) డీజీ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించింది.