తెలంగాణ
దసరా పండుగ ప్రత్యేక బస్సు సర్వీసులు విజయవంతం- నాగిరెడ్డి
TGSRTC: దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులు అత్యంత ప్రణాళికాబద్ధంగా, విజయవంతంగా కొనసాగుతున్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. పండుగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ED), అన్ని రీజినల్ మేనేజర్లు (RM) ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
