తెలంగాణ

TG: కొండపోచమ్మ నీళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఎందుకు?: సీఎం రేవంత్

TG: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిపై రాజకీయ యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి విధానాల వల్లే రాష్ట్రం నేడు ఈ దుస్థితికి చేరిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఏకంగా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో వృథాగా పోశారని ఆయన నిప్పులు చెరిగారు. ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్.. కేసీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపుపై రేవంత్‌రెడ్డి సంచలన వివరాలు బయటపెట్టారు. "కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువుకు ప్రత్యేకంగా కాలువ తవ్వించారు. అక్కడి నుంచి భారీ మోటార్ల ద్వారా నేరుగా నీటిని ఎత్తిపోస్తూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నారు.