తెలంగాణ

TG: సీఎం అండతో బల్మూరి వెంకట్ భూదందా.. మెతుకు ఆనంద్ ఫైర్!

TG: సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ధీమాతోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వికారాబాద్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడుతూ సామాన్యులను వేధిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కబ్జాకు గురైనట్లు చెబుతున్న భూమిని స్వయంగా పరిశీలించిన ఆయన, బాధిత రైతు మహ్మద్ అజ్మత్ పాషాను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నేతలు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆనంద్ మండిపడ్డారు.వికారాబాద్ జిల్లాలోని సర్వే నంబర్ 277లో మహ్మద్ అజ్మత్ పాషా 25 ఏళ్ల క్రితం ఐదున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే, ఆ పొలం పక్కనే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సుమారు 10 ఎకరాల భూమిలో ప్లాటింగ్ డెవలప్‌మెంట్ చేపడుతున్నారని, ఆ వెంచర్‌కు దారి వేసుకోవడం కోసం తన భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజ్మత్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.