తెలంగాణ

TG: తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమితే ఊరుకోం: బృందా కారత్ వార్నింగ్

TG: తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డా అయిన నల్గొండ గడ్డపై సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ బృందా కారత్ గర్జించారు. నల్గొండలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, ఇటు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా ఘాటైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లింల గొడవగా మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.