తెలంగాణ

వంట గదుల్లో బొద్దింకలు, ఎక్స్‌పైరీ పదార్ధాలు.. క్లౌడ్ కిచెన్లలో దారుణాలు

TG Safe: హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో క్లౌడ్ కిచెన్లపై TG SAFE FOOD WING, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 25 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పలు క్లౌడ్ కిచెన్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఆహార భద్రతకు సంబంధించిన పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వంట గదుల్లో బొద్దింకలు, కీటకాలు

తనిఖీల సందర్భంగా ఒక కిచెన్‌లో సుమారు 15 బాక్సుల ఫుడ్ కలర్స్‌ అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన సగ్గుబియ్యం నిల్వలను కూడా కనుగొన్నారు. అంతేకాకుండా వంట గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు ఉండటం చూసి షాక్ అయ్యారు. కూరగాయలు కట్ చేసేందుకు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. మరోవైపు బొంబాయి రవ్వలో కూడా కొన్ని రకాల కీటకాలను గుర్తించడం కలకలం రేపింది.