తెలంగాణ
మహబూబాబాద్ అడ్డాగా సర్వే వార్.. ఎవరి బలం ఎంత?
TG Politics : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో అప్పుడే ఎన్నికల వేడి తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రజల నాడి పట్టుకునేందుకు చేపడుతున్న అంతర్గత సర్వేలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై వేయి రోజుల మైలురాయి దాటుతున్న వేళ.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నియోజకవర్గాల్లో ఒకరు డిజిటల్ సర్వే నిర్వహిస్తే, మరొకరు సీక్రెట్‌గా గ్రౌండ్ రియాలిటీని శోధిస్తున్నాయి.ఈ ముందస్తు రాజకీయ కసరత్తులో బీఆర్ఎస్ అధిష్టానం ఒక అడుగు ముందే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు అత్యంత పకడ్బందీగా ‘ఆన్లైన్ లింకుల’ ద్వారా సర్వే నిర్వహిస్తోంది.
